- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్యూటీ చేస్తూనే నిరసనలు
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పరిస్థితుల్లోనూ వైద్యారోగ్య రంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లు నల్లబ్యాడ్జీలు ధరించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న నర్సు, పారామెడికల్ తదితర వైద్యారోగ్య శాఖలోని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మూడు రోజుల క్రితమే లిఖితపూర్వకంగా క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించిన తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ల అసోసియేషన్ అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరుకావాల్సిందిగా పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం డ్యూటీ చేస్తూనే నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 3,311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఉన్న లీగల్ చిక్కులను పరిష్కరించి వెంటనే నియామక ప్రక్రియ మొదలయ్యేలా చొరవ తీసుకోవాలని నర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు.
కరోనా పరిస్థితుల్లో నర్సులపైనా, వైద్య సిబ్బందిపైనా పనిభారం పెరిగిందని, సిబ్బంది కొరత కారణంగా ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం నర్సులను నియమించుకోడానికి నోటిఫికేషన్‌లు ఇస్తున్నా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతులనే ఎంచుకుందని, చేరడానికి నర్సులు ఆసక్తి చూపడంలేదని ఆసోసియేషన్ సెక్రటరీ జనరల్ లక్ష్మణ్ రుడావత్ పేర్కొన్నారు. ఇకపైన నర్సులు, వైద్య సిబ్బంది నియామకాలు రెగ్యులర్ ప్రాతిపదికనే జరగాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చేరబోమంటూ నర్సింగ్ పూర్తిచేసిన విద్యార్థులు సైతం స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. నర్సింగ్ అధికారులు కూడా తాత్కాలికంగా నియమించే పోస్టుల్లో చేరరాదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన గుర్తుచేశారు.
వైద్యులకు, నర్సులకు, వైద్య సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించి కరోనా కారణంగా చనిపోయిన డాక్టర్ నరేష్, నర్సింగ్ ఆఫీసర్ జయమణి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి అందించాలని, వారి కుటుంబంలో ఒకరికి జాయింట్ కలెక్టర్ ఉద్యోగం కల్పించాలని, 500గజాల స్థలాన్ని వారి ఇంటి నిర్మాణం కొరకు ఇవ్వాలని, వారి పిల్లల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ఈ నిరసనల సందర్భంగా ప్రభుత్వాన్ని అసోసియేషన్ డిమాండ్ చేసింది.