రెండో సారి నెగెటివ్ వస్తేనే పూర్తిగా కోలుకున్నట్టు..

by sudharani |   ( Updated:2020-04-12 01:14:23.0  )
రెండో సారి నెగెటివ్ వస్తేనే పూర్తిగా కోలుకున్నట్టు..
X

కరోనా సోకిన వ్యక్తికి చికిత్స అనంతరం మొదటి సారి నెగెటివ్ వస్తే చాలదని, రెండోసారి కూడా నెగెటివ్ వస్తేనే అతడు పూర్తిగా కోలుకున్నట్టు అని సౌత్ కొరియాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ స్పష్టం చేసింది. దీని ప్రకారం డిశ్చార్చి అయిన వ్యక్తికి మళ్లీ కరోనా వచ్చే అవకాశం లేకపోలేదని వెల్లడించింది. అందుకు కరోనా నుంచి కోలుకున్న 51 మందిని మళ్లీ పరిక్షించగా అందులో కొందరికి పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. కొన్ని కేసుల్లో మాత్రం ఒకరోజు పాజిటివ్, మరోరోజు నెగెటివ్ వస్తుందని వివరించింది. కావున, కరోనా సోకిన వ్యక్తి డిశ్చార్జి అయ్యాక మరోసారి టెస్ట్ చేయించుకుని నిర్దారించుకోవాలని సూచించిది.

Tags: lockdown, discharged person, 2nd time carona, south koria

Advertisement

Next Story