- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్వారంటైన్ కేంద్రాల నుంచి డిశ్చార్జ్ !
దిశ, హైదరాబాద్ : కొవిడ్-19 (కరోనా) వైరస్ మరింత వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా వైరస్ సోకిన బాధితులకు గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వైరస్ బాధితుల కాంటాక్ట్ జాబితాలో ఉన్న వారందరినీ గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించిన తరువాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే చికిత్స నిమిత్తం ఐసోలేషన్‌లో, నెగెటివ్ వస్తే ఇంక్యుబేషన్ టైం (14 రోజులు) పూర్తయ్యే వరకు క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారందరికీ ప్రభుత్వమే అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది. ఈ వైరస్ నివారణకు ఎలాంటి మందులు లేకపోవడంతో ముందస్తు జాగ్రత్తలతోనే వైరస్‌ను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న వారందరికీ 14 రోజులు గడువు ముగియడంతో అధికారులు ప్రస్తుతం వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు.
క్వారంటైన్ నుంచి ఇండ్లకు..
రాష్ట్ర వ్యాప్తంగా 1089 మంది ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే సుమారుగా 604 మంది ఉన్నట్టు గుర్తించారు. వీరందరినీ పట్టుకున్న అధికారులు.. హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. నగరంలోని అమీర్‌పేట నేచర్ క్యూర్ ఆస్పత్రిలో మొత్తం 210 మంది ఉండగా, మంగళవారం నాటికి 15 మంది డిశ్చార్జ్ కాగా, 195 మంది ఉన్నారు. ప్రస్తుతం వీరి క్వారంటైన్ టైం ముగియడంతో బుధవారం 195 మందిని వారి ఇళ్ళకు పంపించారు. పాతబస్తీలో క్వారంటైన్‌లో ఉన్న 249 మందిలో 17 మందికి కరోనా పాజిటివ్ తేలడంతో.. వారందరినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో మొత్తం 157 మంది ఉండగా, మొదటి విడతలో 30 మందిని డిశ్చార్జ్ చేయగా.. రెండో విడతలో మిగతా వారిని డిశ్చార్జ్ చేశారు. దీంతో హైదరాబాద్ జిల్లాలో కరోనా వైరస్ సోకిన అనుమానితులు ఇక లేనట్టుగానే భావించాల్సి వస్తోంది. ఇక మీదట కొత్త వారిని గుర్తిస్తేనే క్వారంటైన్‌లో ఉంచాల్సి ఉంది.
Tags : corona effect, corona virus, quarantine centers,hyd collectrate, sd eye hospital, nizamia college, naturecure hospital,