దివ్యాంగులు నిరాశ పడొద్దు.. చరిత్రలో ఎందరో ఉన్నారు.. సుదర్శన్ రెడ్డి

by Sampath |
దివ్యాంగులు నిరాశ పడొద్దు.. చరిత్రలో ఎందరో ఉన్నారు.. సుదర్శన్ రెడ్డి
X

దిశ, ఘట్కేసర్ : ఎదులాబాద్ గ్రామంలో వికలాంగుల దినోత్సవం వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పద్మజ ముఖ్య అతిథులుగా హాజరై వికలాంగులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

అంతేకాకుండా వారితో కలిసి భోజనం చేయడం వారిని గౌరవించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దివ్యాంగుల తల్లిదండ్రులు మరియు వారి సేవ చేస్తున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దివ్యాంగులు ఎవరూ అధైర్య పడకుండా ప్రతి ఒక్క దాంట్లో ముందుండాలని ఎంతో మంది దివ్యాంగులు కలెక్టర్లు అయిన చరిత్ర ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాలేరు సురేష్, ఎంపీటీసీ గట్టగళ్ళ రవి ఎంపీటీసీ కో ఆప్షన్ సభ్యులు హెర్బల్ ఏపీడీ యాదయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి మండల సీసీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed