కర్లీ హెయిర్ ఉందని కంగనాను రిజెక్ట్ చేశారట…

by Jakkula Samataha |
కర్లీ హెయిర్ ఉందని కంగనాను రిజెక్ట్ చేశారట…
X

కంగనా రనౌత్ … బాలీవుడ్ క్వీన్ గా అభివర్ణిస్తారు. కానీ ఈ బాలీవుడ్ రాణి… సినిమాల్లో అవకాశం కోసం చాలానే కష్టపడిందట. ఒక్క చాన్స్ ఇవ్వాలని డైరెక్టర్ల చుట్టూ తిరిగిందట. కానీ బక్క పలుచగా, పిచ్చుక గూడు లాంటి కర్లీ హెయిర్ తో ఉన్న తనకి చాన్స్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదట దర్శక, నిర్మాతలు. సినీ చరిత్రలో ఇలాంటి కర్లీ హెయిర్ తో ఏ హీరోయిన్ రాణించలేదని … హీరోయిన్ అంటే స్ట్రయిట్ హేర్ తో అందంగా ఉండాలని అన్నారట. కానీ… ఇలాంటి విమర్శల్ని పట్టించుకోకుండా ప్రయత్నించిన కంగనా… ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ గా ఎదిగింది. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోంది అంటూ ట్వీట్ చేసింది కంగనా సోదరి రంగోలి చందేల్. కంగనాను సినిమాల్లో కర్లీ హెయిర్ తో చూసిన అమ్మాయిలు… తనను ఫాలో అవుతున్నారని… సూపర్ స్టార్ లా కనిపించాలి అంటే మన హెయిర్ కర్లీగా ఉండాలని చెప్పుకుంటున్నారు అని తెలుపుతూ తన సోదరి ఎలా సూపర్ స్టార్ గా మారిందో తెలుపుతూ ట్వీట్ చేసింది. ఒకప్పుడు దర్శకులు తన చెల్లిని చిన్నచూపు చూశారని.. కానీ ఇప్పుడు తను ఒక ఫ్యాషన్ ఐకాన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉందని తెలిపింది. ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక లాంటి ఎన్నో గొప్ప చిత్రాలతో మెప్పించిన కంగనా…. ప్రస్తుతం లాక్ డౌన్ పీరియడ్ ను కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. తన సోదరి దగ్గర కేక్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకునే పనిలో నిమగ్నమైంది.

Tags: Kangana Ranaut, Bollywood, Queen

Advertisement

Next Story

Most Viewed