- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘క్రాక్’ నిర్మాతపై దర్శకుడి ఫిర్యాదు
దిశ, సినిమా: సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘క్రాక్’ చిత్రం వివాదాల నడుమే రిలీజైంది. ఇప్పటికి కూడా ఈ చిత్రానికి సంబంధించిన ఆర్థిక వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత ఠాగూర్ మధుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడం హాట్ న్యూస్‌గా మారింది. తనకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ క్లియర్ చేయలేదని.. ఇందుకు నిరాకరిస్తున్నారని డైరెక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు రూ. 50 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని తెలుస్తుండగా.. నిర్మాత మధు ఈ విషయంపై మరో కోణంలో వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్‌ను మించి సినిమాను రూపొందించడం వల్లే ఇలా చేసినట్లు చెప్తున్నారు. రూ.15 కోట్ల బడ్జెట్, రూ. 25 కోట్లకు చేరితే తను మాత్రం ఏం చేస్తానని వివరించినట్లు తెలుస్తోంది. మరి నిర్మాతల మండలి దీనికి ఎలాంటి పరిష్కారం ఇస్తుందో చూడాలి.