హరీష్ శంకర్ దాతృత్వం

by Shyam |
హరీష్ శంకర్ దాతృత్వం
X

కరోనా మహమ్మారి కారణంగా మానవ జీవితానికి ముప్పు ఏర్పడింది. ఎంతో మంది జీవనోపాధి లేక కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు వారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో 100 మంది పార్ట్ టైమ్ జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందించారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన దర్శకుడు … ఈ గొప్ప కార్యంలో భాగస్వామ్యం అయ్యేందుకు కారణం మా మిత్రుడు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అని తెలిపారు. ఇది ఒక్కరోజులో పూర్తయ్యే పని కాదని… ఇది మా బాధ్యత అని తెలిపారు.

ఇంతకు ముందు కూడా తన పుట్టినరోజును పురస్కరించుకుని అనాధ పిల్లలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు హరీష్ శంకర్. ప్రతి ఒక్కరూ కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా హరీష్ శంకర్ చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు ప్రశంసించారు.

Tags :Harish Shankar , Kranthi Kiran, Tollywood, Director

Advertisement

Next Story

Most Viewed