భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. ఎందుకంటే

by Harish |
tax
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం భారీగా పన్ను వసూళ్లను సాధించింది. 2021-22లో సెప్టెంబర్ 22 నాటికి నికరంగా రూ. 5.7 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ. 3.27 లక్షల కోట్లతో పోలిస్తే 74 శాతం పెరగడం గమనార్హం. అడ్వాన్స్ పన్ను వసూళ్లు 65 శాతం పెరిగి రూ. 2.53 లక్షల కోట్లకు చేరుకున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్లపై కొవిడ్ మహమ్మారి ప్రభావమయ్యాయి. మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్‌ ఆదాయపు పన్ను వసూళ్లు రూ. 3.02 లక్షల కోట్లు కాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ. 2.67 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 22 నాటికి రూ.75,111 కోట్లను రిఫండ్‌లుగా ఇచ్చామని సీబీడీటీ తెలిపింది.

Advertisement

Next Story