బీజేపీ నేతపై దాడి.. కార్యకర్తలపై గన్స్ గురిపెట్టిన భద్రతా సిబ్బంది.(వీడియో)

by Shamantha N |
బీజేపీ నేతపై దాడి.. కార్యకర్తలపై గన్స్ గురిపెట్టిన భద్రతా సిబ్బంది.(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే రాష్ట్రంలో అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీజేపీ నేత దిలీప్‌ఘోష్‌పై టీఎంసీ కార్యకర్తలు దాడికి దిగినట్టు బీజేపీ ఆరోపించింది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవనీపూర్‌లో నియోజకవర్గంలో దిలీప్‌ఘోష్‌ పర్యటించారు.

ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఎంసీ కార్యకర్తలు దూసుకొచ్చారు. ఈ క్రమంలో అప్రమత్తమైన దిలీప్‌ఘోష్ భద్రతా సిబ్బంది దాడి జరగకుండా అడ్డుకున్నారు. అయితే, ఈ సందర్భంగా టీఎంసీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు ఘోష్ భద్రతా సిబ్బంది తుపాకులు బయటకు తీసి గాల్లోకి ఎక్కుపెట్టినట్టు బయటకు వచ్చిన వీడియోలు, ఫొటోలు సంచలనంగా మారాయి. కానీ, బీజేపీ మాత్రం దిలీప్‌ఘోష్, అర్జున్ సింగ్‌పై దాడి జరిగినట్టు ఆరోపించింది.

అయితే, అధికార టీఎంసీ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది. తాజా ఘటన నేపథ్యంలో భవానీపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. కాగా, బీజేపీ నేత దిలీప్ ఘోష్‌పై దాడి ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా మమత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Next Story