- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్‌కు దిల్ రాజు రూ.100 కోట్ల ఆఫర్
దిశ, సినిమా : ఇళయ దళపతి విజయ్‌కు ఒక్క కోలీవుడ్‌లోనే కాక మిగతా ఇండస్ట్రీల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. తను నటించిన సినిమాలు టాలీవుడ్‌లోనూ డబ్ అవుతుండగా.. తెలుగులో స్ట్రెయిట్ ఫిల్మ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కాగా ఆ ప్రయత్నాలు ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చేలా ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో విజయ్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనుండగా.. ఇందుకోసం విజయ్‌కు రూ.100 కోట్లు ఇచ్చేందుకు సిద్దమయ్యాడని సమాచారం. అంతేకాదు టోకెన్ అడ్వాన్స్ కింద ఇప్పటికే రూ.10 కోట్లు చెల్లించాడని, ప్రాజెక్ట్ మొదలయ్యాక మిగతా మొత్తం ఇవ్వనున్నాడని తెలుస్తోంది.
సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో విజయ్ ఒకడు కాగా.. తమిళ్‌లో ఒక మూవీ చేసిన తర్వాత తెలుగు సినిమాను పట్టాలెక్కిస్తాడని టాక్. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో విజయ్ తన 65వ సినిమా చేస్తుండగా.. ఇందులో పూజా హెగ్డే లీడ్ రోల్ చేస్తోంది.