- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యాక్సిన్ కోసం.. రాజ్‌భవన్‌లో పబ్లిసిటీ వాహనాలు ప్రారంభం
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. శనివారం రీజినల్ ఔట్‌రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) వ్యాక్సినేషన్ పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ మొబైల్ వీడియో పబ్లిసిటీ వాహనాలను రాజభవన్‌లో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీకాపై ప్రజల్లో ఉన్న అనుమానాలు క్రమంగా తొలిగిపోతున్నాయని తెలిపారు. దేశంలో 42 కోట్ల మందికి పైగా టీకాలు అందుకొని అత్యధిక టీకాలు అందించిన దేశంగా నిలిచిందన్నారు. టీకా తీసుకుని కరోనా వైరస్ పట్ల బాహుబలిగా మారాలన్న ప్రధానమంత్రి పిలుపును ఆమె గుర్తుచేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు వ్యాక్సిన్ చేరవేసేలా ప్రభుత్వం తగిన చర్యలు చేట్టాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సరైన సమయంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రీజనల్ ఔట్‌రీచ్ బ్యూరోను గవర్నర్ అభినందించారు. పది మొబైల్ డిజిటల్ ప్రచార వాహనాలు జులై 24 నుంచి 30 వరకు రాష్ట్రంలోని 29 జిల్లాలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయని ఆమె తెలిపారు.