14 నుంచి ‘డిజిటల్​ దిశ’ శిక్షణ

by Shyam |
14 నుంచి ‘డిజిటల్​ దిశ’ శిక్షణ
X

దిశ, న్యూస్​బ్యూరో: జూనియర్​ కళాశాలల లెక్చరర్లకు నైపుణ్య శిక్షణకు ఉద్దేశించిన ‘డిజిటల్​ దిశ’ ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్​ బోర్డు ప్రకటిచింది. 12 బ్యాచ్​లకు పదిహేను రోజుల పాటు జరిగే ఈ ఆన్​లైన్​ శిక్షణ తరగతులకు రాష్ట్రవ్యాప్తంగా 5,300 మంది లెక్చరర్లు హాజరుకానున్నారు. డిజిటల్​ టీచింగ్​ పద్ధతులు, డిజిటల్​ కంటెంట్​ డెవలప్​మెంట్​ టూల్స్ మీద లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement

Next Story