- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముచ్చటగా మూడోసారి తప్పదా..? ఇప్పటికే నాటిన విత్తనాలు వృథా!
దిశ, తెలంగాణ బ్యూరో: వరుస వర్షాలు రైతులకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. పంటలకు అవసరానికి మించి వర్షాలు నమోదవుతుండటంతో నాటిన విత్తనాలు వృథావుతున్నాయి. భారీ వర్షాలకు మొలకెత్తిన పత్తిపంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇప్పటికే రెండుసార్లు విత్తనాలను నాటిన రైతులు మూడోసారి కూడా నాటక తప్పదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు నమోదువుతున్నాయి. బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుండటంతో మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఈ పరిస్థితులే కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 నుంచి జులై 18 వరకు సాధారణ వర్షాపాతం 262.3మిమీ ఉండగా ఇప్పటి వరకు 49 శాతం ఎక్కువగా 391.3 మిమీ వర్షాపాతం నమోదైంది. గత వారం రోజుల నుంచి అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 144.1మిమీ, భద్రాద్రి కొత్తగూడెంలో 119.8మిమీ, ఆదిలాబాద్ లో 139.మిమీ, వరంగల్ రూరల్ లో 140మిమీ వర్షాపాతం నమోదవగా ఆదిలాబాద్, జనగాం, భూపాలపల్లి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఆసీఫాబాద్ జిల్లాలో భారీగానే వర్షాలు నమోదయ్యాయి.
నాటిన పత్తి విత్తనాలు వృథా
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు పత్తి పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 80లక్షల ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహించడం, మార్కెట్‌లో అధిక ధరలు నమోదవుతుండటంతో సాగవుతున్న కోటి 40లక్షల ఎకరాల్లో 45శాతం మంది రైతులు పత్తిపంట వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం తలెత్తిన వాతావరణ పరిస్థితులు పత్తి రైతులకు నష్టాలను తెచ్చిపెడుతోంది. మొలకెత్తిన పంటలు, నాటిన విత్తనాలు భారీ వర్షానికి దెబ్బతింటున్నాయి.
మూడోసారి విత్తనాలు నాటాల్సి వస్తుంది
ఈ సీజన్ మొదట్లో భారీగా వర్షాలు కురియడంతో రైతులు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తున్నాయని జూన్ మొదటి, రెండో వారంలో పత్తి విత్తనాలను నాటారు. ఈ విత్తనాలు మొలకెత్తేందుకు జూన్ చివరి వారం నుంచి జులై మొదటి వారం వరకు సరిపడా వర్షాలు కురియకపోవడంతో రైతులు మొదటిసారి పంట నష్టపోయారు. తిరిగి జులై రెండో వారం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు రెండోసారి విత్తనాలను నాటారు. ప్రస్తుతం భారీగా కురుస్తున్న వర్షాలు రెండోసారి నాటిన విత్తనాలను, మొలకెత్తిన పత్తిపంటలను పూర్తిగా దెబ్బతీస్తుండటంతో రైతులు మూడోసారి విత్తనాలను నాటిల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.