- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది : డీకే అరుణ
దిశ, కొడంగల్ : కొడంగల్ పట్టణ కేంద్రంలో మంగళవారం ఎంపీ డీకే అరుణ పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా రూ.4.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు కొడంగల్ పట్టణ కేంద్రంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ, అమృత భారత్ పథకం కింద నియోజకవర్గానికి 4.5కోట్లు మంజూరు అయ్యాయని ప్రతి ఇంటికి తాగునీటి అందించే లక్ష్యంగా పైప్ లైన్ వాటర్ ట్యాంకుల నిర్మించి ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అలాగే పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇందిరమ్మ ఇళ్ల పేరుతో నిధులు మళ్లీస్తున్నారని వాటిని వాడుకుంటామంటే ఊరుకోబోమని అన్నారు. తదుపరి కొడంగల్ బీజేపీ సీనియర్ నాయకులు మంత్రి డీకే అరుణ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గంటి సర్వేశ్వర్, కరెంట్ శ్రీనివాస్, సాయి కుమార్, ప్రవీణ్, పాండురంగ, ప్రతాప్ రెడ్డి, పగుడాకుల శ్రీనివాస్, బంటు రమేష్, తదితరులు, పాల్గొన్నారు.