Thala Ajith: తమిళ హీరో అజిత్‌కు తప్పిన పెను ప్రమాదం

by Gantepaka Srikanth |
Thala Ajith: తమిళ హీరో అజిత్‌కు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌(Hero Ajith)కు పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌ రేసింగ్‌(Dubai Racing)లో ట్రాక్‌ను అజిత్‌ కారు ఢీకొట్టింది. కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. హీరో అజిత్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’(Good Bad Ugly) అనే సినిమాలో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు మూవీ టీం వెల్లడించింది. ఇక మరోవైపు ప్రస్తుతం రేసింగ్ కోసం అజిత్ దుబాయిలో శిక్షణ తీసుకుంటున్నారు. అలా ప్రాక్టీస్ చేస్తున్న టైమ్‌లోనే ఈ కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అజిత్ ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ రేసింగ్‌ కాంపిటేషన్‌లలో పాల్గొన్నారు. అంతేకాదు.. షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు.. రేసింగ్‌లకు వెళ్తుంటాడు. కేవలం కారు మాత్రమే కాదు.. బైక్ రేసర్ కూడా. సినిమాల్లో కూడా చాలా వరకు రేసింగ్ సీన్లు డూప్ లేకుండా ఒరిజినల్‌గా ఆయనే చేస్తుంటడం విశేషం.

Heading

Content Area


Advertisement

Next Story