- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BJP: దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే.. ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మల్కాజ్ గిరి(Malkaj giri) ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender) అన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP State Office) వద్ద జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కాంగ్రెస్(Congress) పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. మిస్టర్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా ? అని, మీ ఇంటిలిజెన్స్ పనిచేస్తుందా లేదా ? అని నిలదీశారు. అంతేగాక పార్టీ కార్యాలయాల మీద దాడి చేసే సంసృతి సిగ్గుచేటు అని, మీ పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు అని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని, గుండాల మాదిరిగా దాడిచేసిన కాంగ్రెస్ నాయకులు(Congress Leaders), కార్యకర్తలపై కఠిన చర్యలు(Strict Action) తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని ఈటల హెచ్చరించారు.