ప్రెగ్నెంటే అవ్వలేదు కానీ.. మగ బిడ్డకు జన్మనిచ్చింది

by Shyam |   ( Updated:2021-04-08 03:22:51.0  )
ప్రెగ్నెంటే అవ్వలేదు కానీ.. మగ బిడ్డకు జన్మనిచ్చింది
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ సృష్టిలోనే తీయనైంది అమ్మ ప్రేమ. ఒక బిడ్డకు జన్మనిస్తున్నామని తెలిసిన తర్వాత మహిళ పడే ఆనందం మాటల్లో చెప్పలేనిది. తనకి పుట్టబోయే వారికి ఏం కొనాలి? ఎలా చూసుకోవాలని కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచే ఆలోచించడం మొదలు పెడుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న తన కడుపును చూస్తూ మురిసిపోతుంది. అయితే ఇవేమి చేయకుండానే ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాను తల్లి కాబోతున్న విషయం తనకు తెలియకపోవడం. ఇదేం విచిత్రం తల్లి అయ్యందని తెలియకపోవడం ఏంటీ అని ఆశ్చర్య పోతున్నారా… ఐతే ఈ విచిత్ర సంఘటన గురుంచి తెలుసుకోవాల్సిందే.

అమెరికాలోని బోస్టన్ నగరంలో ఒక మహిళకు డోనాల్డ్ అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం పెళ్లైంది. అప్పటినుంచి వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళకు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఇటీవలే ఆమె కిడ్నీ లో రాళ్లు ఉంన్నాయని వైద్యులు తెలిపారు. ఇక ఈ మధ్యనే ఆమెకు మళ్లీ నొప్పి రావడం మొదలయ్యింది. కిడ్నీలో రాళ్లు పడిపోయే ముందు వచ్చే నొప్పి కావచ్చని భావించి బాత్ రూంలో కి వెళ్లింది. అయినా ఇంకా భరించలేని నొప్పి రావడంతో భర్త ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వైద్యులు ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టారని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ షాక్ కి గురయ్యారు. తాను గర్భవతి అయిన విషయం తనకు తెలియదని, ఇదంతా ఏదో కలలా ఉందని ఆమె పేర్కొంది.

Advertisement

Next Story