విజయోత్సవాలొద్దు.. పార్టీ శ్రేణులను కోరిన దీదీ, స్టాలిన్

by Shamantha N |
విజయోత్సవాలొద్దు.. పార్టీ శ్రేణులను కోరిన దీదీ, స్టాలిన్
X

కోల్‌కతా, చెన్నై: దేశంలో కరోనా వీరవిహారం చేస్తున్న తరుణంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవాలు, భారీ ఊరేగింపులు వద్దని గెలిచిన అధిపతులు తమ పార్టీ కార్యకర్తలను కోరుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో ఇప్పటికే విజయం ఖరారైపోగా.. తుది ఫలితాలు వెలువడాల్సి ఉంది. మధ్యాహ్నం వరకే గెలుపులు ఖరారైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు.. విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. అయితే విజయోత్సవాలు వద్దని డీఎంకే అధినేత స్టాలిన్, బెంగాల్ సీఎం దీదీ కార్యకర్తలను కోరారు. బెంగాల్ లో టీఎంసీ 219 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి హ్యాట్రిక్ విజయం దిశగా కొనసాగుతున్నది.

ఇక మరోవైపు డీఎంకే కూడా 143 సీట్లలో ఆధిక్యంలో ఉంది. విజయం ఖరారైపోవడంతో డీఎంకే శ్రేణులు ఆ పార్టీ కార్యాలయాల ఎదుట సంబురాలు చేసుకున్నారు. దీనిపై ఈసీ సీరియస్ అయింది. పలువురిపై ఎఫ్ఆర్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ స్పందిస్తూ.. విజయోత్సవాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. బెంగాల్ సీఎం దీదీ స్పందిస్తూ… ‘అందరికీ ధన్యవాదాలు. విజయోత్సవాలను జరుపుకోకండి. కార్యకర్తలందరూ తమ ఇళ్లకు వెళ్లిపోండి..’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ‘జై బంగ్లా’ అని నినదించారు.

Advertisement

Next Story