లాక్‌డౌన్‌లో బ్రిటన్ యువత దేనికీ బానిస అయ్యారో తెలుసా?

by sudharani |
corona virus
X

దిశ వెబ్‌డెస్క్: మొదటి విడత లాక్‌డౌన్‌ విధించటంతో ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ప్రజలు కొత్త అలవాట్లను ఎంచుకున్నారని పలు అధ్యాయాలు తెలియజేశాయి. చాలా సంవత్సరాల తరువాత విరామం దొరకటంతో తమ అభి రుచులకు కొంతమంది తిరిగి పదును పెట్టారు. వాటిలో నచ్చిన వంటలు వండుకు తినటం, పెయింటింగ్, పుస్తకాలు చదవటం, పిల్లలతో గడపటం వంటికి ప్రాధాన్యమిచ్చారని మనకు తెలిసిందే. అయితే ఆశ్యర్యకరంగా బ్రిటన్‌లో ఇందుకు భిన్నంగా జరిగింది.

మొదటి విడత లాక్‌డౌన్ సమయంలో కొత్తగా 6,52,000 వేలమంది ధూమపానానికి అలవాటు పడ్డారని తెలిసింది. వాటితో పాటు మద్యానికి సైతం బానిస అయ్యారని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. వీరిలో ఎక్కువ మంది 18 నుంచి 34 సంవత్సరాల వయస్సు ఉన్న వారే కావటం గమనార్హం. కొన్ని వందల మందిని సర్వే చేసి మరీ ఈ సమాచారం కనుగొన్నట్లు వెల్లడించింది. దాదాపు ఏడు నెలల పాటు ఈ డేటాను సేకరించి, విశ్లేషించామని నిర్వాహకులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ కాలంలో మొదలు పెట్టి అనతీ కాలంలోనే ధూమపానానికి, మద్యానికి విపరీతంగా బానిస కావటంతో సైడ్ ఎఫెక్ట్‌ల బారిన పడ్డట్లు సంబంధిత యువకులు తెలిపినట్లు సర్వే సంస్థ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed