సాగర్ బైపోల్.. నేతలకు షాక్.. మా ఊళ్లోకి రావొద్దంటూ వార్నింగ్

by Shyam |   ( Updated:2021-03-29 10:18:50.0  )
సాగర్ బైపోల్.. నేతలకు షాక్.. మా ఊళ్లోకి రావొద్దంటూ వార్నింగ్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తమ హయాంలో అభివృద్ది జరిగిందంటే.. మా హయాంలో జరిగిందంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రసంగాలు దంచికొడుతున్నాయి. కానీ అదే నియోజకవర్గంలోని ఓ గ్రామస్తులు మాత్రం అన్ని రాజకీయ పార్టీలకు ఊహించని షాకిచ్చాయి. ‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయితున్నా.. కనీస అభివృద్దికి నోచుకోలే. మా ఊళ్లే తాగేందుకు మంచినీళ్లు లేవు. ఇన్నేండ్లు ఓటేసినం. ఇగ ఎవ్వరికీ ఓటు వేసిన అంతే సంగతి. ఉపఎన్నికలో ఓట్లు అడింగేందుకు మా ఊళ్లకి ఎవ్వరు రావొద్దు’ అంటూ ఆ గ్రామస్తులు ఏకంగా పెద్ద ప్లెక్సీని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ఆ ప్లెక్సీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఇంతకీ ఆ గ్రామం ఏంటి అనుకుంటున్నారా.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం వేంపాడు గ్రామపంచాయతీపరిధిలోని గగ్గినపల్లివారిగూడెం, కుమ్మరిగూడెం గ్రామాలు.

ఆ రెండు గ్రామాల ప్రజలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని అంశాలు ఇవే.. ‘ మా గ్రామ ప్రజలు నోటుకు అమ్ముడుపోరు మాకు అభివృద్దే ముఖ్యం. గ్రామానికి రోడ్డు లేదు. మా గ్రామం నుంచి ఎటువంటి రెవెన్యూ లేదని గ్రామసర్పంచ్ అభివృద్ది పనులు చేయట్లే. అందుకే మా గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తించాలి. ఊళ్లో స్థంభాలు, వీధీ దీపాలు సరిగా లేవు. మురికి కాల్వలు అసలే లేవు. పారిశుద్ధ్య వాహనం దిక్కేలేదు. చేతిపంపులు పనిచేయట్లేదు. ఊరికి రోడ్డు లేక పిల్లలు బడికి పోవుడు.. రేషన్ తెచ్చుకునేందుకు మస్తు ఇబ్బంది అయితుంది’. అంటూ ఫ్లెక్సీ రెండు గ్రామాలకు వచ్చే ప్రధాన ద్వారం వద్ద కట్టారు.

Advertisement

Next Story

Most Viewed