సమంత-చైతన్య విడాకులు.. ట్వీట్స్ పెడుతున్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదే..?

by Anukaran |   ( Updated:2021-09-14 01:26:54.0  )
సమంత-చైతన్య విడాకులు.. ట్వీట్స్ పెడుతున్నారు కానీ క్లారిటీ ఇవ్వట్లేదే..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అడోరబుల్ కపుల్ నాగ చైతన్య, సమంత విడాకుల టాపిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యామిలీ కోర్టులో వీరి కేసు నడుస్తోందని, త్వరలోనే వీరి విడాకుల అధికారిక ప్రకటన రానున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక వీటినేమి పట్టించుకోకుండా సామ్, చై మాత్రం వారి వారి పనులల్లో నిమగ్నమైపోయారు. సామ్ కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ తీసుకొని టూర్లతో, ఆమె పెట్స్ తో సమయం గడుపుతోంది. మరోపక్క చై తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రూమర్స్ గురించి ఎవరు ఏమి మాట్లాడకపోవడంతో అభిమానులలో అనుమానాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక నిన్న సామ్ చేసిన ఒక్క ట్వీట్ మరోమారు వారి వైవాహిక బంధంలో కలతలు ఉన్నాయని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లుంది.

సామ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.. ఇక చైతన్య సినిమా కానీ, పోస్టర్ కానీ రిలీజ్ అయితే అమ్మడు ప్రమోషన్ మొదలుపెట్టేది. చై ని ఆకాశానికెత్తేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పేది. కానీ, ఈసారి మాత్రం ఏదో ఫార్మాలిటీ గా విష్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చైతూ ట్వీట్ ని కోట్ చేస్తూ.. ”విన్నర్.. టీమ్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్” అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ట్వీట్ లో చై గురించి ఏమి మాట్లాడకుండా సాయి పల్లవిని అప్రిషియేట్ చేయడం అభిమానులకు మింగుడు పడలేదు. దీంతో ఈ ట్వీట్ ఏదో ఫార్మల్ గా పెట్టి ఉంటుంది .. దీనికి చై ఏమి రిప్లై ఇవ్వడు అనుకున్నారు అందరు. కానీ, అందరి అంచనాలను తారుమారుచేస్తూ చైతన్య సామ్ ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. తమ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ స‌మంత చేసిన ట్వీట్‌ను చైతూ రీట్వీట్ చేస్తూ ‘థ్యాంక్యూ సామ్’ అని పేర్కొన్నాడు. దీంతో చై-సామ్ జంట మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఒక్క ట్వీట్ తో అందరికీ సమాధానం దొరికిందని అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరోపక్క ఇంకొన్ని అనుమానాలు కూడా అభిమానులు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ట్వీట్ చేయకపోయినా, ఒకరిగురించి ఒకరు మాట్లాడకపోయినా ఈ టాపిక్ ఇంకా హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఎందుకు సామ్, చై కి ప్రమోషన్ చేయడం లేదు.. నిజంగానే వీరిద్దరూ మాట్లాడుకోవడంలేదా..? అని ఒక వేళ సామ్ ట్వీట్ కి చై రిప్లై ఇవ్వకపోతే అతనే ఈ గొడవలకు కారణమా అనే ఉద్దేశం వస్తోందని.. అందుకే ఈ జంట తమ విభేదాల గురించి బయటికి చెప్పకుండా ఇలా చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ అనుమానాలు అన్ని తీరాలంటే అక్కినేని వారి కొడుకు-కోడలు ఇద్దరు కలిసి ఒక క్లారిటీ ఇవ్వాలి. అదెప్పుడు జరుగుతుందో .. అప్పటివరకు ఈ పుకార్లు ఆగేలా లేవంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story