‘సిక్సు కొట్టినా బౌలర్‌ను అభినందించేవాడు’

by Shyam |   ( Updated:2020-08-10 08:57:29.0  )
‘సిక్సు కొట్టినా బౌలర్‌ను అభినందించేవాడు’
X

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా సీనియర్ క్రికెటర్, సీఎస్కే జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీపై శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీది చాలా విలక్షణమైన నాయకత్వమని, అతని నిరాడంబరమైన వ్యక్తిత్వమే శిఖరాన నిలబెట్టిందని ముత్తయ్య పేర్కొన్నారు. క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్‌లో మురళీధరన్ అనేక విషయాలు వెల్లడించారు. ‘ధోనీ కచ్చితంగా యువ సారథే. అతని వ్యూహాలు, సిద్ధాంతాలు చాలా బాగుంటాయి. ఫీల్డింగ్ స్థానాలను సెట్ చేసే విషయంలో బౌలర్లకే పూర్తి స్వేచ్ఛనిస్తాడు. ఒక మంచి బంతిని బ్యాట్స్‌మాన్ సిక్సర్‌గా మలచినా ధోనీ చప్పట్లతో బౌలర్‌ను అభినందిస్తాడు. బౌలర్ పెట్టే ఫీల్డింగ్ పని చేయనప్పుడే వారితో చర్చించి మార్పులు చేస్తాడు. బౌలర్ల నుంచి కావల్సింది రాబట్టుకోవడంలో ధోనీది అందెవేసిన చేయి’ అని మురళీధరన్ అభిప్రాయపడ్డాడు. ధోనీ జూనియర్లకు సలహాలు ఇవ్వడమే కాకుండా, సీనియర్ల అభిప్రాయాలను గౌరవిస్తాడు. వారందరి మాటలు విన్న తర్వాతే చివరకు ఒక నిర్ణయం తీసుకుంటాడని మురళి చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story