- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధోని కృషితోనే కెప్టెన్ అయ్యా : కోహ్లీ
దిశ, స్పోర్ట్స్: టీమిండియాకు గంగూలీ, ధోనిల తర్వాత విజయవంతమైన కెప్టెన్ ఎవరని అడిగితే అందరూ కోహ్లీ అనే చెబుతారు. భారత జట్టును మరో స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం కేవలం కోహ్లీకే ఉందని అనేక మంది మాజీ ప్లేయర్లు చెబుతున్నారు. కాగా, భారత క్రికెట్ జట్టుకు తాను కెప్టెన్ కావడం వెనుక మాజీ సారథి ధోని కృషి ఎంతో ఉందని కోహ్లీ వెల్లడించాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. తనలో నాయకత్వపు లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వ్యక్తి ధోని అనీ, అతను కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా తన నిర్ణయాలకు విలువిచ్చేవాడని చెప్పాడు. ఆట సమయంలో మైదానంలో ఎన్నో సార్లు ధోనీ పక్కన నిలబడి అతను చెప్పే సూచనలు వినేవాడిననీ, ధోని నిర్ణయాలు చాలా కచ్చితత్వంతో ఉంటాయని తెలిపాడు. ఆ లక్షణాలే తానూ అలవర్చుకున్నాననీ, అదే నన్ను కెప్టెన్సీ వైపు నడిపించిందని చెప్పాడు. అయితే, ధోని తర్వాత తాను కెప్టెన్ అవుతానని అనుకోలేదనీ, కానీ ఏదో ఒక రోజు మాత్రం టీం ఇండియాకు నాయకత్వం వహిస్తానని మాత్రం నమ్మానని కోహ్లీ చెప్పుకొచ్చాడు.