‘పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు’

by Shyam |
‘పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు’
X

దిశ, నిజామాబాద్: ఏఐసీసీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గత నెలలుగా కరోనా వైరస్ మూలంగా ప్రజలంతా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదర్కొంటున్నారని అన్నారు. గత 20 రోజులుగా వరుసగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ మూలిగే నక్క పైన తాటిపండు పడ్డ చందంగా బీజేపీ ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో వ్యవహరించడం శోచనీయమని విమర్శించారు. ఒకవైపు ఉపాధి లేక, ఉన్న ఉద్యోగాల్లో జీతాల్లో కోత, వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డుపై పడ్డారు. ఇంత దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వాలు మానవత్వాన్ని మరిచిపోయి, బాధ్యతలను విస్మరించి, ధరలు పెంచుతూ మోడీ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారు అన్నారు. ఇకనైనా పేద, మధ్యతరగతి ప్రజలకు చేయూత ఇవ్వాలని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని మానాల డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed