‘సేవా వృత్తులకు సమాజమే బాకీ పడ్డది’

by Shyam |
‘సేవా వృత్తులకు సమాజమే బాకీ పడ్డది’
X

దిశ, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌లకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ సేవా వృత్తి సంఘాలు శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో నిర్వహించారు. ధర్నాకు ముఖ్య అతిధిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, తెలంగాణ గంగపుత్ర సంఘం అధ్యక్షులు ఏఎల్ మల్లయ్య, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి రాయప్పలు హాజరయ్యారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… రజకులు, నాయీ బ్రాహ్మనులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని తెలిపారు. అందుకు సమాజమే సేవా వృత్తులకు బాకీ పడిందన్నారు. ఈ వర్గాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఫెడరేషన్‌లకు ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిధులు కేటాయించడం లేదని తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. సేవా వృత్తులకు న్యాయం జరిగేలా శాసన మండలిలో చర్చిస్తాన్నారు. ధర్నాలో వివిధ కుల వృత్తులకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు.

tags : Dharna at Indira Park, budget, service professions, BC President National Presidents R. Krishnaiah, MLC Narsireddi

Advertisement

Next Story

Most Viewed