- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ రాసిస్తే.. ఉత్తమ్ చదివాడు: ధర్మపురి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ అవగాహనకు వచ్చాయని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బ్రోకర్‌గా మారాడని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర పదజాలంలో వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డుపై ఉత్తమ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని, కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా ప్రస్తావించాడా..? అని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, యువనేత రాహుల్ గాంధీ ట్రేడర్ల నుంచి కోట్ల రూపాయాలు దిగమింగి దిగుమతులకు అనుమతులిచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ కరువైందని, అందుకే రాహుల్ గాంధీ యూపీ నుంచి కేరళకు వెళ్లి ఎంపీగా పోటీచేశాడని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ఉత్తమ్ పార్లమెంట్‌లో చదువుతున్నాడని, రెండు పార్టీలు అవగాహనకు రావడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. పసుపు బోర్డు గురించి ఇంతలా మాట్లాడుతున్న ఉత్తమ్.. సొంత సెగ్మెంట్‌లో జరుగుతున్న అవకతవకలను ఎందుకు పట్టించుకోవడం లేదో..? చెప్పాలన్నారు. నీ నియోజకవర్గంలో మైహోం రామేశ్వరం అక్రమంగా మైనింగ్ తవ్వుతుంటే నీవేందుకు రియాక్ట్ కావడం లేదన్నారు. రామేశ్వరం దగ్గర డబ్బులు తీసుకోకపోతే.. మైనింగ్ వ్యవహారంపై స్పందించాలన్నారు. పసుపు బోర్డు కంటే మెరుగైనది ఎక్స్టెన్షన్ బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేసినా.. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏదో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడనుకుంటే ఆయన కూడా కేసీఆర్‌కు లొంగిపోయాడని విమర్శించారు.
దొంగలు పడ్డాక..
పసుపు బోర్డు విషయంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి వ్యవహార శైలి దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందనంగా ఉందని విమర్శించారు. స్పైస్ బోర్డు కేరళకు అవసరం లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రాష్ట్రంలో బోర్డును ఏర్పాటుచేసిన విషయాన్ని ఆయన గుర్తిస్తే బాగుంటుందని హితవుపలికారు. సురేశ్ రెడ్డి ఒక్కప్పుడు అందరితో బాపు అనిపించుకునేవారని, కానీ ఇప్పుడు కేసీఆర్ దగ్గర బానిసగా మారిపోయాడని ఎద్దేవా చేశారు.