కరోనా కష్టాల్లో "ధర్మ" భరోసా : కరణ్ జోహార్

by vinod kumar |   ( Updated:2023-04-01 16:03:58.0  )
కరోనా కష్టాల్లో ధర్మ భరోసా : కరణ్ జోహార్
X

ప్రపంచాన్ని తిప్పలు పెడుతుంది కరోనా. బయట తిరిగితే బలితీసుకుంటానాని హెచ్చరిస్తోంది. కరోనా ధాటికి భారత్ నెల రోజులుగా లాక్ డౌన్ పాటిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావం తగ్గే వరకు ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ( స్టే హోమ్… స్టేట్ సేఫ్ ) సూచించింది ప్రభుత్వం. తద్వారా కరోనా చెయిన్ బ్రేక్ చేయొచ్చు అని నిర్ణయించింది. ప్రజాక్షేమం కోసమే ఇదంతా చేసినా… రోజూ వారి కూలి చేసుకుని బతికే జీవితాలు కష్టాల కడలిలో కొట్టుకుంటున్నాయి. కనీస అవసరాలు తీర్చుకోలేక, తిండిలేకుండా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు నిరుపేదలు. ఇలాంటి సమయంలో మనం ఒకరికోసం ఒకరం తోడుగా నిలవాలని పిలుపునిస్తున్నారు బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహార్. కరోనా పై కలిసి యుద్ధం చేస్తూ… కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మన బాధ్యత అని… అందుకే లాక్ డౌన్ సమయంలో బాధల్లో ఉన్నవారికి ఉపశమనం కలిగించేందుకు ధర్మ కుటుంబం ముందుకొచ్చింది అని తెలిపారు. ఆహారం ఎలా సంపాదంచుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండడం నిజంగా భయపెడుతుందన్నారు. అసలు మాకు ఆహారం దొరుకుతుందా? లేదా? అనే భయం నిజంగా కలచివేస్తుందన్నారు. అలాంటి వారి కష్టాల్లో పాలుపంచుకుని.. కాస్త భరోసా ఇచ్చేందుకు ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.

పీఎం కేర్స్ రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందించడంతో పాటు గివ్ ఇండియా ఫండ్ రైజర్స్, గూంజ్, జొమాటో ఫీడింగ్ ఇండియా, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాతో కలిసి తన సేవలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది ధర్మ ప్రొడక్షన్స్. కరణ్ జోహార్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు… మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు..

Advertisement

Next Story