- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధనుష్ సినిమాకి నోటీసులు… దర్శకుల రియాక్షన్ ఇదే
దిశ, సినిమా : ధనుష్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కర్ణన్’. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం నుంచి రిలీజైన ‘పండరతి పురాణం’ పాటలో సమాజానికి హాని కలిగించే సాహిత్యం ఉందని, ఆ పాటను తొలగించే వరకు సినిమాపై నిషేధం విధించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కొద్ది రోజుల కిందట కోర్టు ‘కర్ణన్’ నిర్మాత, దర్శకుడికి నోటీసులు పంపింది. కాగా దీనిపై స్పందించిన దర్శకులు.. ‘పండరతి పురాణం’ పాటను ‘మంజనతి పురాణం’గా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాట సాహిత్యం మార్చడం వెనుకున్న ఉద్దేశాన్ని వివరించారు.
‘కర్ణన్ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మద్దతిచ్చినందుకు నా అభిమానులకు కృతజ్ఞతలు. మీరు నా పట్ల చూపించే ప్రేమ.. పనిచేసేటప్పుడు బాధ్యత వహించాలని నేర్పింది. ప్రజల విలువలను గౌరవిస్తూ ‘పండరతి పురాణం’ పాట సృష్టించబడింది. అయితే, సమాజంలో కొన్ని పదాలు సృష్టించే ప్రభావాన్ని ఊహించలేం. ‘పండరతి పురాణం’ చుట్టూ కాంట్రవర్సీ నెలకొంది, అందుకే దీనికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే పాట పేరును అధికారికంగా ‘మంజనతి పురాణం’గా మార్చాం’ అని స్పష్టం చేశారు. కాగా రాజిషా విజయన్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ‘కర్ణన్’ ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది.