- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒమిక్రాన్ వేరియంట్‌పై డీహెచ్ కీలక సూచన
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రాష్ట్రంలో నమోదైనట్లు వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. భారత్‌లో ఒమిక్రాన్ కేసులు ఇప్పటివరకు నమోదుకాలేదని స్పష్టం చేశారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కు ధరించడం, భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తే ఎన్ని మ్యుటేషన్లనైనా ఎదుర్కొవచ్చని తెలిపారు. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేశారని తెలిపారు. ఈ క్రమంలో కరోనా కేసులు అధికంగా ఉన్న 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించారు. రిస్క్ ఉన్న దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 41 మంది ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా ఎవరికీ కరోనా సోకలేదని తెలిపారు. కొత్త వేరియంట్ ఆరు రేట్లు ఉధృతంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని, కానీ తీవ్రత తక్కువ ఉంటుందని వెల్లడించారు. ఒమిక్రాన్ బాధితుల్లో తలనొప్పి, అధిక నీరసం లాంటి లక్షణాలుంటాయని తెలిపారు.