- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కఠిన చర్యలు తప్పవు.. మరియమ్మ లాకప్ డెత్‌పై డీజీపీ వ్యాఖ్యలు
దిశ, ఖమ్మం: అడ్డగూడూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన మరియమ్మ కస్టోడియల్ మరణం చాలా బాధాకరమని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మరియమ్మ కుటుంబసభ్యలను పరామర్శించి ఖమ్మం కమిషనర్ కార్యాలయంలో నార్త్ జోన్ ఐజీపీ వై. నాగిరెడ్డి ,పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ .. మరియమ్మ మరణానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుందని, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సిన బాధ్యత పోలీసుశాఖలోని పోలీసు అధికారులపై ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణంతో ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పనిచేస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించిందని ఈ సందర్భంగా తెలిపారు. నేరాల నియంత్రణ, నేరస్ధులను పట్టుకున్న సమయంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కేసుల విచారణ సమయంలో ప్రాణాలకు, ఆత్మగౌరవం దెబ్బతినకుండా చట్టప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసు అధికారులు,సిబ్బందిపై ఉందన్నారు.