DGP: బేగంపేటలో తనిఖీలు చేసిన డీజీపీ

by Shyam |   ( Updated:2021-05-24 02:00:42.0  )
DGP: బేగంపేటలో తనిఖీలు చేసిన డీజీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. అందులో భాగంగానే సోమవారం బేగంపేటలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను, లాక్‌డౌన్ అమలు తీరును డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనవసరంగా ఎవరూ రోడ్లమీదకు రావొద్దని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

Advertisement

Next Story