- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోవిడ్ వ్యాక్సిన్‌పై అపోవాహలు వీడండి : డీజీపీ
దిశ, క్రైమ్ బ్యూరో: కోవిడ్ వ్యాక్సిన్ పట్ల అపోహలు వీడాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ప్రజలకు సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి శనివారం మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఉన్నతాధికారి డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ తిలక్ నగర్ పీహెచ్‌సీలో, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు మల్కాజిగిరిలో సీపీ మహేష్ భగవత్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటిగా వారు కోవిడ్ షీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయన మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం నుంచి 4 రోజుల పాటు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ వేయించుకుంటున్నందున ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దన్నారు. ప్రతిఒక్కరూ ముందుకొచ్చి ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ వందశాతం సురక్షితమైందన్నారు. రాష్ట్రంలో సీనియర్ పోలీసు అధికారుల నుంచి పోలీసు సిబ్బంది అంతా వ్యాక్సినేషన్ వేసుకుంటున్నారని అన్నారు.
కరోనా ప్రారంభంతో పాటు లాక్‌డౌన్ సమయంలో ప్రజల వెంటే పోలీసులు ఉండి వారికి సేవలు అందించారని గుర్తుచేశారు. వైద్య, ఆరోగ్యశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో పోలీసులు లాక్‌డౌన్ సమయంలో అందించిన సేవల ద్వారా ప్రజలకు భరోసా కల్పించామని అన్నారు. అందుకు పోలీస్‌శాఖతో సహా అన్ని శాఖల అధికారులకు మంచి గుర్తింపు లభించిందని అన్నారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉత్తమ సేవలు అందించారని మహేందర్ రెడ్డి అభినందించారు. పోలీస్‌శాఖకు నాలుగు రోజులు మాత్రమే వేసే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరిన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరుతామని అన్నారు. ఇదిలా ఉండగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్లలో శనివారం పోలీసులకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
రాచకొండ పరిధిలో మొత్తం 6,600 మంది పోలీస్ సిబ్బంది ఉండగా, వీరిలో 2700 ఏఆర్ సిబ్బంది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వ్యాక్సిన్ వేయించుకుంటున్నట్టు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాచకొండలో మొత్తం 48 కేంద్రాలను గుర్తించగా, అందులో 30 కేంద్రాలలో టీకాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ 100 మందికి వ్యాక్సిన్ వేస్తారన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శనివారం నాటికి 800 మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ డీసీపీ శిల్పవల్లి, మేడ్చల్ డీఎం అండ్ హెచ్‌వో మల్లికార్జున్, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, నేరేడ్‌మెట్, మల్కాజిగిరి ఎస్హెచ్వోలు కె.ఆనంద్, డాక్టర్ రెడ్డి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వ్యాక్సిన్ ప్రారంభం అయినప్పటికీ, అధికారులు వివరాలు వెల్లడించలేదు. కాగా, సైబరాబాద్ కమిషనరేట్ లో వ్యాక్సిన్ శనివారం ప్రారంభించలేదు. సైబరాబాద్ పరిధిలో సోమవారం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.