- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన డీజీపీ..
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతి ఇచ్చారు. రైతుల పాదయాత్రకు 20 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే మహాపాదయాత్రకు శుక్రవారం హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మొదట పాదయత్రకు అనుమతి ఇవ్వమన్న డీజీపీ కోర్టు ఆదేశాలతో పునరాలోచనలో పడ్డారు. ఇతర ఉన్నతాధికారులతో చర్చించి అనుమతి ఇచ్చారు.
ఉ.6 నుంచి సాయంత్రం 6గంటల వరకే యాత్ర..
మహాపాదయాత్రకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో డీజీపీ కీలక ఆదేశాలు చేశారు. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించొద్దని సూచించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎన్నికల కోడ్ పాటించాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రలో 157 మందికి మించి పాల్గొనకూడదని ఆదేశించారు. రైతుల పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని కండీషన్స్ పెట్టారు. ప్రతి రోజు ఉ.6 గంటల నుంచి సా.6 గంటలలోగా పాదయాత్ర ముగించాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు.