అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షల పొడిగింపు

by Shamantha N |
అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షల పొడిగింపు
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలను కేంద్రం వచ్చే నెలాఖరు వరకు పొడిగించింది. నవంబర్ 30వ తేదీ వరకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై ఆంక్షలను పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) బుధవారం వెల్లడించింది. ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమానాలు సంబంధిత అధికారిక సంస్థల అనుమతుల మేరకు నడుస్తాయని వివరించింది. ఈ ఆంక్షలు అన్ని కార్గో విమానాలు, డీజీసీఏ ఆమోదించిన విమానాలకు వర్తించవని స్పష్టం చేసింది. మార్చి 23వ తేదీ నుంచి విమాన సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మేలో వందే భారత్ మిషన్, జులై నుంచి ఎయిర్‎బబుల్ అరేంజ్‌మెంట్ ఆధారంగా కొన్ని మార్గాల్లో విమానసేవలు అందుబాటులోకి వచ్చాయి. యూకే, యూఎస్, యూఏఈ, ఫ్రాన్స్ సహా సుమారు 18 మంది దేశాలతో విమాన సేవలను పరస్పరం అందించుకోవడానికి ద్వైపాక్షికంగా ఎయిర్ బబుల్ ఒప్పందాలను కేంద్రం సర్కారు చేసుకున్నది. మే 25 నుంచి దేశీయ విమాన సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విధితమే.

Advertisement

Next Story

Most Viewed