Triyuginarayana temple : శివపార్వతుల కళ్యాణం జరిగింది అక్కడే.. ఇప్పటికీ అలాగే ఉన్న సాక్ష్యాలు..

by Sumithra |   ( Updated:2024-08-13 09:01:12.0  )
Triyuginarayana temple : శివపార్వతుల కళ్యాణం జరిగింది అక్కడే.. ఇప్పటికీ అలాగే ఉన్న సాక్ష్యాలు..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంటారు. అదేవిధంగా హిందూ మతంలో కూడా, వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధంగా పరిగణించబడదు రెండు కుటుంబాల కలయికగా పరిగణిస్తారు. హిందూ మతంలో, వివాహ సంబంధాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే శివపార్వతుల వివాహం ఎక్కడ జరిగింది, ఆ ప్రాంతం ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మన భారత దేశంలో భోళాశంకరుని ఆలయాలకు కొదువేమీ లేదు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో చరిత్ర కలిగి ఉంటుంది. అలాగే పురాణాల ప్రకారం శివ పార్వతుల వివాహం జరిగిన ఓ ఆలయం ఉందని తెలుసా. ఈ ఆలయంలోనే ఆ మహాదేవుడు పార్వతీఅమ్మవారిని కళ్యాణం చేసుకున్నాడట. ఆ ఆలయం ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్‌లో రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ అనే జిల్లాలో ఉన్న ఉఖిమత్ లో ఉందని చెబుతున్నారు అక్కడి పండితులు. ఈ ఆలయాన్ని త్రియుగినారాయణ దేవాలయం అని పిలుచుకుంటారట.

త్రేతా యుగంలో ఈ ఆలయాన్ని నిర్మించారని, శివపార్వతుల వివాహానికి సాక్ష్యం కూడా ఈ ఆలయంలో ఉందని చెబుతారు. కోవెలలో నిత్యం జ్వలించే అఖండ ధుని శివపార్వతుల పెళ్లికి పెద్ద సాక్ష్యమని చెబుతారు. కొత్తగా పెళ్లైన జంటలు, అలాగే సంసార జీవితంలో కలహాలు ఉన్న జంటలు ఈ ఆలయాన్ని దర్శిస్తే వైవాహిక జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయని, ఎలాంటి గొడవలు ఉండవని చెబుతున్నారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.

Advertisement

Next Story

Most Viewed