- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేటి తిరుమల సమాచారం.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు చాలా మంది వెళుతుంటారు. ఎక్కడెక్కడి నుంచో జనాలు తిరుమల చేరుకుంటారు. ప్రస్తుతం వార్షిక బ్రహ్మోత్సవాలతో తిరమల కోలాహలంగా మారిపోయింది. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయి నేటికి 8వ రోజు కావడంతో భక్తుల రద్దీ కాస్త తగ్గిందని చెప్పవచ్చు. నేడు ఉభయ కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. భక్త జనసందోహం నడుమ ఉదయం 6 గంటల 55 నిమిషాలకు రథోత్సవం మొదలు కాగా స్వామి వారిని ఉరేగిస్తూ తిరుమూడవీధుల వెంట తిప్పారు.
గోవింద నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. ఇవాళ రాత్రి మలయప్ప అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. రేపు చక్ర స్నాన మహోత్సవం తో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోందని సమాచారం. ఇదిలా ఉంటే.. నిన్న ఆదివారం.. ఏడవ రోజు శ్రీవారిని 66,598 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.88 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. 25, 103 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.