- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో శివలింగం ఉన్నవారు.. రోజు అభిషేకం చేయాలా.. జ్యోతిష్యులు ఏమి చెబుతున్నారంటే?
దిశ, ఫీచర్స్ : హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ భక్తితో వారికి ఇష్టమైన దేవుడిని పూజిస్తారు. కొందరైతే శివలింగాన్ని ఇంట్లోకి తెచ్చుకుని పూజలు చేస్తుంటారు.అయితే, మనలో చాలా మందికి ఒక సందేహం ఉంది శివలింగాన్నిఇంట్లోకి తెచుకోవచ్చా?తెచ్చుకున్నవారు రోజూ అభిషేకం చేయాలా?.. అని ఇలా కొందరు సందేహిస్తుంటారు. దీనికి జ్యోతిష్యులు ఏమి చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
ఇంట్లో శివలింగాన్ని ఉంచితే ఎలాంటి దోషాలు ఉండవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే శివలింగం మరీ పెద్దదిగా ఉండకూడదని చెబుతున్నారు. చిన్న విగ్రహాలను ప్రతిష్టించినప్పుడు, అదే విధంగా పూజలు చేయాలి. భోళా శంకరుడుపై చెంబుడు నీళ్లు పోసినా, అతను సంతోషిస్తాడు. అలాగే బిల్వపత్రాన్ని సమర్పిస్తే మీ కోరికలన్నీ తీరుస్తాడు. ఇంట్లో పెట్టుకున్న దేవతలకు రోజూ పూజలు, అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే కొంతమంది తమ ఇళ్లలోకి దేవుళ్లను తెచ్చుకుంటారు. కానీ, వారు పూజకు సమయాన్ని కేటాయించలేరు. అలాంటి వారు ప్రతిరోజూ తడి గుడ్డను తీసుకుని దేవుడి పటాలను శుభ్రపరచాలి.
పెద్ద దేవాలయాల్లో అయితే, శివలింగానికి భస్మంతో అభిషేకం చేస్తారు. కానీ మనం మన ఇళ్లలో సాధారణ పద్ధతిలో పూజించాలి. ప్రతిరోజూ అభిషేకం చేసి దేవుడిని పూజిస్తే శుభఫలితాలు వస్తాయని, అలాగే జాతకంలో దోషాలు ఉంటే తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.