- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామ దేవతల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే !
దిశ, వెబ్ డెస్క్ : ప్రతి గ్రామానికి.. ఆ గ్రామాన్ని కాపాడే గ్రామ దేవత ఉంటుంది. ఆమె ఎవరో కాదు.. జగన్మాతే .. కానీ ఇలా వెలిసిన ఆ జగన్మాతను రక రకాల పేర్లతో పిలుస్తుంటారు. తలుపులమ్మ తల్లి అని , సీతలాంబ అని, మావుళ్ళమ్మ అని , అచ్చమ్మ అని, కట్టమ్మ అని ఇలా రక రకాల పేర్లతో మనం పిలుచుకుంటాం. ఇక ఈ క్రమంలో గ్రామ దేవతలకు పేర్లు ఎలా వచ్చాయో ఇక్కడ చూద్దాం.
తలుపులమ్మ తల్లి
భక్తులు కోరిన కోర్కెలు తీర్చి.. వారికి అండగా నిలబడుతుంది. తలపు అంటే ఆలోచన.. వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ.. క్రమంగా తలుపులమ్మగా మారింది.
మావుళ్ళమ్మ తల్లి
సాధారణంగా 15 ఊళ్లకు ఒక దేవత ఉంటుంది. మా ఉళ్ళన్నింటికి అమ్మ అనే అర్ధంలో ఆమెను మావుళ్ళమ్మ అని పిలుస్తుంటారు. అదే క్రమంగా మావుళ్ళమ్మ తల్లిగా మారింది.
కట్ట మైసమ్మ తల్లి
ప్రతి వ్యక్తికి కొంత కాలం జీవించాలనే ఒక కట్ట ఉంటుంది. దాన్నే అవధి అంటారు..ఈ తల్లి శక్తికి ప్రతిరూపమని భక్తులు నమ్ముతుంటారు. క్రమంగా కట్ట మైసమ్మ తల్లిగా గా మారింది