అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే..

by Sumithra |
అఖండ జ్యోతిని వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో దేవుణ్ణి ఆరాధించే సమయంలో ఖచ్చితంగా జ్యోతిని వెలిగిస్తారు. కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నవరాత్రులు వంటివి నిర్వహించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అఖండ జ్యోతిని వెలిగిస్తారు. ఇలా వెలిగిస్తేనే తప్ప పారాయణం లేదా ఆరాధన పూర్తి కాదట. అయితే చాలా మంది అఖండ జ్యోతిని వెలిగించే టప్పుడు కొన్ని నియమాలను పాటించరు. దాంతో వారికి పూజాఫలితం దక్కక పోవచ్చు. అసలు అఖండ దీపం వెలిగించే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం..

పూజ సమయంలో దీపం వెలిగించడం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే దీపం లేకుండా పూజలు పూర్తి కావు. ఈ పూజ దీపాలలో అఖండ జ్యోతికి మరింత ప్రాముఖ్యత ఉంది. దీనిని వెలిగించడం వలన కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుందని, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. అంతే కాదు ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి ఉపశమనం పొంది, శాంతి లభిస్తుందని చెబుతున్నారు. దీపం వెలుగులో ఉండే కాంతి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పొగొట్టి ఆనందం కలిగిస్తుంది. అలాగే పేదరికాన్ని పోగొడుతుంది.

అఖండ జ్యోతిని వెలిగించే నియమాలు

అఖండ జ్యోతిని వెలిగించే ముందు, మీరు గణేశుడు, శివుడు, దుర్గాదేవిని ధ్యానించడం మర్చిపోకూడదని పండితులు చెబుతున్నారు. జ్యోతి వెలిగించిన తర్వాత ఓం జయంతి, మంగళ కాళీ, భద్రకాళి, కృపాళినీ, దుర్గా, క్షమా, శివ ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే అనే మంత్రాన్ని జపించాలట. అలాగే అఖండ జ్యోతిని నెయ్యితో వెలిగిస్తే కుడి వైపున, నూనెతో వెలిగించిన అఖండ జ్యోతిని ఎడమ వైపున ఉంచాలని చెబుతున్నారు. అఖండజ్యోతిని వెలిగించి నప్పుడు అది పూర్తిగా ఆగిపోయే వరకు దీపాన్ని ఆర్పివేయరాదని చెబుతున్నారు. అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత ఇంటి తలుపులు మూసివేయరాదట, అలాగే ఇంటికి తాళం కూడా వేయవద్దని చెబుతున్నారు. అఖండ జ్యోతి వెలుగుతూ ఉండేందుకు తగినంత మొత్తంలో నెయ్యి లేదా నూనె పోస్తూ ఉండాలి. ఈ జ్యోతిని మరుగుదొడ్డి, బాత్‌రూమ్‌లకు సమీపంలో వెలిగించకూడదు.

అఖండ జ్యోతి వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. అఖండ జ్యోతిని వెలిగించడం ద్వారా శని గ్రహం వల్ల ఏర్పడే దుష్ఫలితాలు నివారించవచ్చు. ఆవనూనెతో అఖండ జ్యోతి వెలిగిస్తే పూర్వీకులు ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది. ఉంఖద్ జ్యోతిని వెలిగించడం ద్వారా శ్వాస, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed