- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శివుడి జన్మరహస్యం.. ఆశ్చర్యకరమైన విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దిశ, వెబ్‌డెస్క్ : మహాశక్తి స్వరూపుడు శివుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నిత్యం పూజలందుకుంటాడు ఈ పరమశివుడు. ఇక శివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఆ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో, ఉపవాసాలు, జాగారణలతో ఆ పరమేశ్వరుడిని నిష్టగా పూజ చేస్తారు శివభక్తులు.అలాంటి శక్తివంతుడైన శివయ్య జన్మరహస్యం గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.అయితే ఈరోజు మనం శివుని జన్మ గురించి తెలుసుకుందాం.
శివ పురాణం ప్రకారం.. హిందూపురాణాల ప్రకారం త్రిమూర్తులలో శివుడు ఒకడు. మొదటివాడు బ్రహ్మ, విష్ణు, శివుడు. శివుడి జన్మ స్వయంగా జరిగింది అంటారు. అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు. అందుకే ఆ నీలకంఠుడిని స్వయంబు అంటారు.పంచభూతాలను శివుడు అందుకే కంట్రోల్ చేయగలడు. దీంతో శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు.
విష్ణు పురాణం ప్రకారం.. విష్ణువు నుదుటి గురించి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి జన్మ జరిగింది. విష్ణువు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. శివ పురాణంలో విష్ణువు జన్మ గురిచి రాసి ఉంది. శివుడు ధ్యానం చేస్తూ.. రుద్రాక్ష మాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఓ రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ గమనించినట్టయితే.. విష్ణు పురాణం, శివ పురాణం రెండు ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంటాయి. ఇలా ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా శివుని జన్మ గురించి రాశారు.