ఆ ఊరి ప్రజలు హనుమంతుడి పేరు వింటేనే కోపంతో ఊగిపోతారు.. కారణమిదే..!

by Prasanna |   ( Updated:2023-11-12 07:22:06.0  )
ఆ ఊరి ప్రజలు హనుమంతుడి పేరు వింటేనే  కోపంతో ఊగిపోతారు.. కారణమిదే..!
X

దిశ,వెబ్ డెస్క్: మనదేశంలో కోట్లాది మంది హనుమంతుడి భక్తులు ఉంటారు. దాదాపు ప్రతి ఊరిలోనూ హనుమాన్ ఆలయం ఉంటుంది. మనసులో ఏ మాత్రం భయంగా ఉన్న.. జై బజరంగ బలి అని తలచుకుంటారు. కానీ మనదేశంలోని ఓ గ్రామంలో మాత్రం హనుమంతుడిని పేరు ఎత్తరు. హునమాన్ గురించి మాట్లాడుకుంటే దాన్ని నేరంగా చూస్తారు. ఆయనపై కోపంగా ఉంటారు. దేవభూమి ఉత్తరాఖండ్‌లోని ఈ గ్రామం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం. అదేంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం..

ఆంజనేయ స్వామి గుడి లేని ఆ ఊరు పేరు ద్రోణగిరి.ఈ ఊరికి రామయణానికి సంబంధముంది.లక్ష్మణుడి ప్రాణాలను రక్షించేందుకు హనుమంతుడు సంజీవని తీసుకొచ్చాడని మనందరికి తెలుసు. అయితే ఈ గ్రామం నుంచే ఆ సంజీవనిని తీసుకెళ్లాడు. ఆ సమయంలో పర్వతాన్ని నేలకూల్చాడు. గ్రామస్తుల ఆగ్రహానికి ఇదే కారణం. ద్రోణగిరి పర్వతం తమ దైవమని గ్రామస్తులు చెబుతారు.

పర్వత దేవత నుంచి అనుమతి తీసుకోకుండా.. ఆయన ధ్యానం కూడా పాడు చేసాడట. ఆ దేవుని కుడి భుజాన్ని కూడా పెకిలించాడు. ద్రోణగిరిలో ఈ రోజు కూడా పర్వత దేవుడి కుడి చేయి నుంచి రక్తం కారుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందువల్ల ఇప్పటికీ హనుమాన్‌పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ పర్వతం ఈ రోజు పూర్తిగా ఇక్కడే ఉండి ఉంటే.. తమ గ్రామం మరింత సుభిక్షంగా ఉండేదని నమ్ముతారు.


Advertisement

Next Story

Most Viewed