పూజలో పెట్టిన కొబ్బరికాయను ఇలా చేస్తే పూజాఫలితం దక్కదట..

by Sumithra |
పూజలో పెట్టిన కొబ్బరికాయను ఇలా చేస్తే పూజాఫలితం దక్కదట..
X

దిశ, ఫీచర్స్ : సనాతన ధర్మంలో దేవతలకు కొబ్బరికాయలు సమర్పించే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. పూజలో కొబ్బరికాయకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొబ్బరి కాయ లేకుండా ఏ పూజలు, ఆచారాలు సంపూర్ణంగా పరిగణించరు. సత్యనారాయణ కథ అయినా, ఇంట్లో హోమం అయినా కొబ్బరికాయను ఖచ్చితంగా ఖచ్చితంగా కలషం రూపంలో పూజలో పెట్టాల్సిందే. కలషంలో పెట్టిన కొబ్బరి కాకుండా సాధారణ కొబ్బరికాయను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు.

హిందూ సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయను లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. ఏవైనా పూజలు నిర్వహించిన తరువాత పండితులు ఆశీర్వదించి కుటుంబ పెద్దకు కొబ్బరికాయను ఇస్తారు. అయితే పూజ తర్వాత పూజలో పెట్టిన కొబ్బరికాయను ఏమి చేయాలో చాలా మందికి తెలియదు. ప్రసాదంగా అందుకున్న ఈ కొబ్బరికాయను పగలగొట్టి తినాలా లేక ఎక్కడైనా భద్రంగా ఉంచాలా. అనే సందేహాలు వస్తుంటాయి.

పూజలో పెట్టిన కొబ్బరికాయ పై దేవతల అనుగ్రహం ఉంటుందని, అది ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని దాన్ని ఇంటి పెద్దకు ఇస్తారు. ఈ కొబ్బరికాయను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టి లాకర్‌లో ఉంచవచ్చు. లేదా ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుమ్మానికి కట్టవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో దేవతామూర్తుల ఆశీస్సులు నిలిచి ఉంటాయి.

అయితే చాలామంది ఆశీర్వదించి ఇచ్చిన కొబ్బరికాయను ఎక్కడైనా భద్రపరచకుండా దేవుడికి సమర్పిస్తారు. ఆ తరువాత ఆ కొబ్బరిని ప్రసాదంగా పంచుతారు. అలా అస్సలు చేయకూడదట. ఇలా చేయడం వలన వారికి సంపూర్ణ పూజా ఫలితం దక్కదు అంటున్నారు. అందుకే పూజలో పెట్టిన కొబ్బరికాయను పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వవద్దు అని శాస్త్రాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed