పొరపాటున కూడా దక్షిణ దిశలో ఇవి ఉండకూడదు.. అవి ఏంటో తెలుసా

by Sumithra |
పొరపాటున కూడా దక్షిణ దిశలో ఇవి ఉండకూడదు.. అవి ఏంటో తెలుసా
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలోని వాస్తునియమాలను అనుసరించడం ద్వారా కుటుంబంలో సుఖసంతోషాలతో ఉంటాయి. ఇంట్లో వాస్తు విషయంలో చిన్న నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్తగా ఉన్నా అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా దిగజారవచ్చు. మరి ఏ వస్తువులను ఏ దిశలో ఉంచాలో పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఇల్లు పూర్తయ్యేవరకు ఖచ్చితంగా వాస్తు నియమాలను పాటిస్తారు. తద్వారా వారు జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. వాస్తు ప్రకారం ఇంటికి దక్షిణం వైపున ఎప్పుడూ పూజగదిని నిర్మించకూడదు. ఇంటి దక్షిణ దిశలో దేవుళ్లకి పూజ చేయడం శుభ ఫలితాలను ఇవ్వదు, ఎందుకంటే పూర్వీకులను ఈ దిశలో పూజిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి దక్షిణ దిశలో పడకగది ఉండటం నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇంట్లోని వారు వ్యాధుల బారిన పడతారు. ఈ దిశలో మంచం ఉంచడం వల్ల పితృ దోషం కూడా కలుగుతుంది.

ఈ వస్తువులను ఈ దిశలో ఉంచవద్దు

ఇంటి దక్షిణ దిశలో ఎలాంటి లోపభూయిష్టమైన యంత్రాలను ఉంచవద్దు. దీని వల్ల ఇంట్లో వాస్తు దోషాలు వస్తాయి. అంతే కాదు ఇంటి దక్షిణ దిశలో చెత్త లేదా పాత వస్తువులను ఉంచవద్దు. దీనివల్ల ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది. మీరు సుఖంగా ఉండాలనుకుంటే ప్రతిరోజు దక్షిణం వైపు ముఖం పెట్టి, మీ పూర్వీకులకు నమస్కరించండి.

వంటగది దక్షిణ దిశలో ఉండకూడదు..

వంటగదిని ఎప్పుడూ ఇంటి దక్షిణ దిశలో ఉంచకూడదు. వంటగది లేదా గ్యాస్ స్టవ్ దక్షిణం వైపు ఉంచినట్లయితే అది మీ జీవితంలో సమస్యలను కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ దిశలో ఆహారాన్ని వండడం, తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యల కారణంగా డబ్బు వృధా కావడం ప్రారంభమవుతుంది. కాబట్టి వంటగది ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండకూడదు. అంతే కాదు ఇంటికి దక్షిణ దిశలో బూట్లు, చెప్పులు పెట్టడం, స్టోర్ రూమ్ ను నిర్మిస్తే పూర్వీకులను అవమానించినట్లుగా పరిగణిస్తారు. ఈ దిక్కులో చెప్పులు వదిలితే మీ పూర్వీకులు ఆగ్రహిస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.

Advertisement

Next Story

Most Viewed