Rakhi Muhurat: ఈ రోజు రాఖీలు ఎప్పుడు కట్టాలన్న విషయం పై స్పష్టత ఇచ్చిన పండితులు

by Prasanna |   ( Updated:2024-08-19 14:49:20.0  )
Rakhi Muhurat: ఈ రోజు రాఖీలు ఎప్పుడు కట్టాలన్న విషయం పై స్పష్టత ఇచ్చిన పండితులు
X

దిశ, ఫీచర్స్ : రక్షాబంధన్ అనేది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక. అన్నదమ్ముళ్ళు సంతోషంగా ఉండాలని, వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అక్కా చెల్లెల్లు, అన్న తమ్ముళ్లకు కట్టే రాఖీ నే ఈ రక్షాబంధన్.

ప్రతీ శ్రావణమాసంలో రాఖీ పండుగ వస్తుంది. ఈ మాసంలో రాఖీ పూర్ణిమకి ఒక ప్రత్యేకత ఉంది. అయితే, ఈ సారి రాఖీ ఎప్పుడు కట్టాలన్న విషయం పై ఎన్నో సందేహాలు ఉన్నాయి. రాఖీ కట్టడానికి ముహూర్త సమయం ఉందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని పై పండితులు స్పందించారు. ఈ రోజు రాఖీ ఎప్పుడు కట్టాలనే విషయంపై స్పష్టంగా చెప్పారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన వేద పండితులు ఫేక్ గా వైరల్ అవుతున్న వార్త పై మండిపడుతున్నారు. అసలు రాఖీ కట్టడానికి ఎలాంటి సమయం, ముహూర్తం ఉండదని స్పష్టం చేశారు. అక్కాచెల్లెళ్లు ఏ సమయంలోనైనా వారి తోబుట్టువులకు రాఖీ కట్టవచ్చని వెల్లడించారు. స్వస్తిశ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం పౌర్ణమి తిథి తేదీ ఆగస్టు 19 సోమవారం రోజున రాఖీ పౌర్ణమి వచ్చిందని తెలిపారు. మధ్యాహ్నం 1:36 నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే రాఖీ కట్టాలన్నా వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. వాటిని ఎవరు నమ్మొద్దు.. తల స్నానం చేసి .. ఇష్ట దేవునికి పూజ చేసుకుని, ఆ తర్వాత రాఖీలు కట్టుకోవచ్చని వెల్లడించారు.


Read more...

Rakhi celebrations: పశువులకు రాఖీ కట్టి.. సముద్రాన్ని పూజిస్తోన్న వైనం.. ఎక్కడో తెలుసా?

Advertisement

Next Story