కలియుగ వైకుంఠం తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ..

by sudharani |
కలియుగ వైకుంఠం తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ..
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గుతుంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు 14 గంటలు క్యూ లైన్లో వేచి ఉండాల్సి ఉంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 61,425 మంది దర్శించుకోగా.. 26,430 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.301 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Advertisement

Next Story