- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shani Dev : శని నక్షత్రంలోకి కుజుడు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు ..!

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలకు అధిపతి అయిన కుజుడు రాశి సంచారాలు చేస్తుంటాడు. ఈ సంచారాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. దీని ప్రభావం 12 రాశుల వారి పైన పడుతుంది. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 3న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే .. మరి కొన్ని రాశులకు ప్రతి కులంగా ఉంటుంది. అయితే, ఆ తర్వాత కుజుడు నక్షత్ర ప్రవేశం కూడా చేస్తాడు. అదే సమయంలో కుజుడు పునర్వాస నక్షత్రంలో నుంచి పుష్యమి నక్షత్రం లోకి సంచారం చేయనున్నాడు. అయితే, ఈ నక్షత్రానికి శని దేవుడు అధిపతిగా ఉండనున్నాడు. ఈ గ్రహం సంచారం వలన రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది. ముఖ్యంగా, ఈ సమయంలో కొన్ని రాశుల వారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు.
కర్కాటక రాశి
కుజుడు నక్షత్ర మార్పుల కారణంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇదే రాశిలో పుట్టిన వ్యక్తులకు సమయం మంచిగా ఉండనుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అధిక లాభాలు పొందడమే కాకుండా.. మంచి నిర్ణయాలతో ముందుకెళ్తారు.
వృషభ రాశి
కుజుడు నక్షత్ర మార్పుల కారణంగా ఈ రాశి వారి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ముఖ్యంగా, అవివాహితులకు పెళ్ళి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, మీ పూర్వీకుల ఆస్తులు మీరు పొందుతారు. దీంతో పాటు ఈ అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇక, మీ వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.