- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ లో శాపగ్రస్తమైన నదులు.. అక్కడి నీటిని తాకారో అంతే సంగతి..
దిశ, ఫీచర్స్ : భారతదేశంలో నదులకు మతపరమైన, సాంస్కృతిక పరమైన ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి నదులు మనల్ని తల్లిలా పోషించాయి. నదుల వల్లనే నాగరికత అభివృద్ధి చెంది గ్రామాలు ఏర్పడ్డాయి. పూర్వకాలంలో చాలా నగరాలు, గ్రామాలు నదుల ఒడ్డునే ఉండేవని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో ప్రవహించే నదుల గురించి చెప్పాలంటే, చిన్న, పెద్ద నదులతో కలిపి దాదాపు 200 నదులు ఉన్నాయి. గంగా, యమున, కావేరి, బ్రహ్మపుత్ర, సరస్వతి, నర్మద, సట్లెజ్ వంటి నదుల పేర్లు మనకు సాధారణంగా సుపరిచితమే. కేవలం ఈ నదుల్లో స్నానం చేస్తే సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతారు. కానీ, శాపగ్రస్త నదుల గురించి ఎప్పుడైనా విన్నారా ? మీరు వినకపోతే, ఈ రోజు మనం భారతదేశంలోని ఆ శాపగ్రస్త నదుల గురించి తెలుసుకుందాం. ఆ నదుల్లో నీటిని తాకడం వల్ల జీవితంలో కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్మనాశ నది..
ఈ నది బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన నదులలో ఒకటి. ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఈ నది నీటిని తాకితే వారి పనులు జరగకుండా ఆగిపోతాయని నమ్ముతారు. ఈ నదిలోని నీరు శాపగ్రస్తమైందని, అందుకే ప్రజలు ఇక్కడి నీటిని తాకరని, ఈ నదుల్లో స్నానం చేయకూడదని అక్కడి ప్రజలు చెబుతారు.
కర్మనాశ నది పేరు కర్మ, నషా అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. ఇక్కడ కర్మ అంటే పని, నాశ అంటే నాశనం. కర్మనాశ నీటిని తాకడం వల్ల అన్ని పనులు చెడిపోతాయని, పుణ్యాలు నాశనం అవుతాయని నమ్ముతారు. ఈ నది గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వకాలంలో ఈ నది ఒడ్డున నివసించే ప్రజలు దుంపలు, పండ్లు మొదలైన వాటిని తింటూ జీవించేవారని, అయితే ఈ నది నీటిని తాగడానికి లేదా వంట చేయడానికి ఉపయోగించరని ప్రజలు ఈ నది గురించి చెబుతారు.
నది శపించబడిన కథ : కర్మనాశ నది పౌరాణిక కథనం ప్రకారం హరిశ్చంద్ర రాజు తండ్రి సత్యవ్రతుడు ఒకసారి తన శరీరంతో పాటు స్వర్గానికి వెళ్లాలనే కోరికను తన గురువైన వశిష్ఠకు తెలియజేశాడు. దీనికి గురు వశిష్ఠుడు నిరాకరించాడు. దీంతో సత్యవ్రతుడు కోపోద్రిక్తుడై విశ్వామిత్రుని వద్దకు వెళ్లి, తన కోరికను వ్యక్తం చేసి, గురువైన వశిష్ఠుని తిరస్కరణను అతనికి తెలియజేశాడు.
గురువు వశిష్ఠతో శత్రుత్వం కారణంగా, విశ్వామిత్రుడు తపస్సు బలంతో సత్యవ్రత రాజును, అతని శరీరాన్ని స్వర్గానికి పంపాడు. ఇంద్రదేవుడు దీనిని చూసి కోపోద్రిక్తుడైనాడు. సత్యవ్రతున్ని తలక్రిందులుగా భూమికి పంపాడు. కాని విశ్వామిత్రుడు తన తపస్సు ద్వారా సత్యవ్రత్ రాజును రక్షించాడు. దీంతో అతను స్వర్గం, భూమి మధ్య ఆగిపోయాడు అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని త్రిశంకు అని పిలుస్తారు. తలకిందులుగా ఉండడం వలన సత్యవ్రతుని లాలాజలం భూమిమీద పడి నదిగా మారడం వల్ల ఈ నది శాపగ్రస్తమైందని నమ్ముతారు.
చంబల్ నది..
చంబల్ మధ్యప్రదేశ్ ప్రధాన నది. ఈ నది గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. చంబల్ ను డకోయిట్ల ప్రాంతంగా పరిగణిస్తారు. ప్రస్తుత కాలంలో డకోయిట్‌లు ఇక్కడ నివసించడం లేదు. అయితే ఇక్కడ ప్రవహించే చంబల్ నదిని అక్కడి ప్రజలు అపవిత్రంగా భావిస్తారు. ఎన్నో జంతువుల రక్తంతో తడిసిన ఈ నది గురించిన కథలను చెబుతారు. పూర్వం రాజు రతీదేవ్ వేలాది జంతువులను చంపి ఈ నదిలోకి రక్తాన్ని ప్రవహించేలా చేశాడని అంటారు. ఈ సంఘటన తరువాత ప్రజలు దీనిని శాపగ్రస్త నదిలా భావించడం ప్రారంభించారట.
ఫల్గు నది..
బీహార్‌లోని గయా జిల్లాలో ప్రవహించే ఫల్గు నది గురించి కూడా భయంకరమైన విషయాలను అక్కడి ప్రజలు చెబుతున్నారు. గయా బీహార్‌లోని ఒక జిల్లా. పిండ దానం, శ్రార్ధకర్మలు చేయడానికి ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం లక్షల మంది వస్తుంటారు. ఇక్కడి ప్రజలు నదిని దేవతగా కాకుండా శాపగ్రస్త నదిగా భావిస్తారు. ఈ నదిని సీతదేవి శపించిందని, అప్పటి నుండి ప్రజలు ఈ నదికి వెళ్లడం మానేశారని పురాణాలు చెబుతున్నాయి.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.