- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేశ్యలకు అలవాటు పడిన అర్చకుడు.. గండం తప్పించుకునేందుకు శివలింగానికి కొప్పు..!?
దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఉన్న ఏ శివాలయంలోనైనా శివలింగం సాధారణంగా దర్శనమిస్తుంది. కానీ ఓ శివాలయంలో మాత్రం కాస్త విచిత్రంగా ఉంటుంది. స్త్రీకి తలపై ఉన్నట్టుగా శివలింగానికి కొప్పు ఉంటుంది. అదేంటి శివలింగానికి కొప్పు ఉండటం ఏంటి అనుకుంటున్నారా. ఇంత విచిత్రమైన శివలింగాన్ని 'కొప్పు లింగేశ్వర స్వామి' క్షేత్రంలో దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం రాజమండ్రికి సమీపంలో 'పలివెల' గ్రామంలోని, 'కౌశికి' నదీతీరాన ఉంది. ఈ ఆలయంలో ఉండే శివున్ని 'అగస్తేశ్వరుడు' అని పిలుస్తారు. అగస్త్యమహర్షి ప్రతిష్ఠించడం వలన ఈ శివలింగాన్ని ఆ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి దక్షిణాన సాంఖ్యాయని, తూర్పున కౌసికి, ఉత్తరాన మాండవి, పల్వల అనే నదుల ఉన్నాయి. మరి ఈ ఆలయానికి 'కొప్పులింగేశ్వరుడు' అనే పేరు ఎందుకు వచ్చింది అంటే. దానికి కూడా ఓ పెద్ద కారణం ఉంది. అది ఏంటంటే...
పూర్వం 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడి కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. గొప్ప శివభక్తుడైన అర్చకుడు స్వామి వారికి నిత్యపూజలు అభిషేకాలు చేసేవాడట. ప్రతి మనిషి లాగా ఆ అర్చకుడు కూడా ఓ సమయంలో బలహీనతలకు లోనై కాంతాదాసుడయ్యాడట. ఆ వలయం నుంచి బయటకు రాలేక వేశ్యాలోలుడయ్యాడట. ప్రతిరోజు శివలింగానికి అలంకరించవలసిన పూలను అర్చకుడు తన ప్రియురాలికి ఇచ్చేవాడట. మళ్లీ అవే పూలను తీసుకువచ్చి ఆ శివునికి అలంకరించేవాడట. ప్రతినిత్యం అలాగే చేసేవాడట. అర్చకుడు వేశ్యలకు ఎంత బానిసైనా శివున్ని కొలవడంలో ఎలాంటి లోటు చేసేవాడు కాదట.
ఒకనాడు మహారాజు స్వామివారిని దర్శించుకోవడానికి దేవాలయానికి విచ్చేశాడు. అర్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహించాడట. మహారాజుకు శివప్రసాదంగా వేశ్యకు అలంకరించి ఆ తరువాత శివలింగానికి పెట్టిన పూలమాలను ఇచ్చాడట. పూలలో ఓ పొడవాటి వెంట్రుక ఉండడాన్ని మహారాజు గమనించాడట. వెంటనే పూజారిని కోపంగా చూసిన మహారాజు ఈ వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది అంటూ అడిగాడట. అప్పుడు అర్చకుడు ఈ సమస్య నుంచి బయట పడటానికి ఓ ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడట. 'ఓ మహారాజా.. ఈ శివలింగానికి కొప్పు ఉంది.. ఆ స్వామివారిదే ఈ పొడవైన వెంట్రుక అని చెప్పాడట.
పూజారి మాటలు విన్న మహారాజు ఏదీ స్వామివారి కొప్పు నాకూ ఒక్కసారి చూపించు' అని అడిగాడట. ఆ మాటలు విన్న అర్చకుడు వెంటనే మహారాజా రేపు ఉదయం రండి స్వామివారి కొప్పును మీకు చూపిస్తాను. ఇప్పుడు అలంకరణ పూర్తి అయింది అని సమాధానం చెప్పాడట. ఆ తరువాత ఆ అర్చకుడు తన కష్టాన్ని గట్టెంక్కించమని స్వామివారిని వేడుకుని వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడట. పరమభక్తుడైన పూజారిని కాపాడేందుకు ఆ శివయ్య తనలింగం పై శిరోజాలతో ఓ పెద్ద కొప్పును సృష్టించి పూజారిని గండం నుంచి గట్టెంక్కించాడట. మరుసటి ఉదయం మహారాజు స్వామి తలపై ఉన్న శిరోజాలను చూశాడట. ఆ తరువాత పూజారిని అనుమానించినందుకు క్షమాపణ కోరాడట. అలా శివలింగానికి కొప్పు ఏర్పడటంతో ఆ స్వామిని కొప్పులింగేశ్వరునిగా పిలుస్తారు.