Rakhi festival : అన్నదమ్ములకే కాదు వదినలకు కూడా రాఖీ కట్టే సాంప్రదాయం..

by Sumithra |
Rakhi festival : అన్నదమ్ములకే కాదు వదినలకు కూడా రాఖీ కట్టే సాంప్రదాయం..
X

దిశ, ఫీచర్స్ : రక్షాబంధన్ భారతీయ సంప్రదాయంలో ఒక ప్రత్యేక పండుగ. పురాతన కాలం నుండి రక్షాబంధన్ గురించిన ఎన్నో పురాణ కథలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో మహాభారత కాలం నాటి ఒక సంఘటన అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అదేంటంటే శ్రీ కృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడిని సంహరించిన తర్వాత చక్రాన్ని తిరిగి ఇచ్చే తీసుకునే సమయంలో శ్రీ కృష్ణుని మణికట్టుకు దెబ్బ తగులుతుంది. అది చూసిన ద్రౌపది శ్రీ కృష్ణుని వెంటనే ఆమె చీరకొంగును చించి శ్రీకృష్ణుని మణికట్టుకు కట్టు కట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్షాసూత్రం కారణంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తానని వాగ్దానం చేశాడట. మారుతున్న కాలంతో పాటు రక్షాబంధన్ పండుగ కూడా చాలా మారిపోయింది.

ఇంటి కోడలికి రాఖీ కట్టే సంప్రదాయం..

పురాణాల కాలం నుంచి అన్నదమ్ములకు రాఖీ కట్టే సాంప్రదాయం వస్తుంది. అలాగే ఇంటికి వచ్చిన కోడళ్లకు ( వదినా మరదళ్ళకు ) లుంబా కట్టే సంప్రదాయం మార్వాడీ కుటుంబం నుంచి మొదలైంది. నిజానికి భార్య తన భర్తకు విధేయత చూపుతుంది. వివాహానంతరం భార్య ప్రతి మతపరమైన పని, యాగం, బాధ్యత, వాగ్దానం మొదలైన వాటిలో భర్తతో కలిసి ఉంటుంది. అందుకే సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టినప్పుడు వారి భార్యలకు కూడా కడుతుంటారు. కోడలిని ఇంటి లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. మీ కోడలికి గులాబీ రంగు రాఖీని కట్టడం వలన బుధుడు, శుక్రుడు మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది.

Advertisement

Next Story