ఆ ఆలయంలో నందిని చూస్తే జంతువుగా పుడతారట..

by Sumithra |
ఆ ఆలయంలో నందిని చూస్తే జంతువుగా పుడతారట..
X

దిశ, ఫీచర్స్ : భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేలాది హిందూ దేవాలయాలను, శివుని క్షేత్రాలను చూడవచ్చు. శివుని ఆలయాలు, పుణ్యక్షేత్రాలన్నీ వాటి వాటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇవి వాటి అద్భుతాలు, మతతత్వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా శివునికి అంకితం చేసిన అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటని చెబుతారు. నేటికీ ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడని చెబుతారు.

పశుపతినాథ్ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండుకు వాయువ్యంగా 3 కి.మీ దూరంలో ఉన్న దేవ్‌పటాన్ గ్రామంలో బాగ్మతి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో శివుడు పశుపతి రూపంతో భక్తులకు దర్శనం ఇస్తాడు. UNESCO వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చన పశుపతినాథ్ ఆలయం నేపాల్‌లోనే అత్యంత పవిత్రమైన ఆలయంగా పరిగణిస్తారు.

ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు దర్శనం చేసుకుంటారు. నేపాల్‌లో ఉన్న ఈ ఆలయంలో భారతీయ పూజారులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని చెబుతారు. దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణుల నుండి నలుగురు పూజారులు, ఒక ప్రధాన పూజారిని ఆలయంలో ఉంచడం అనే సాంప్రదాయం చాలా శతాబ్దాలుగా కొనసాగుతోంది. పశుపతినాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌లో సగంగా చెబుతారు. దీని కారణంగా ఈ ఆలయ శక్తి, ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.

ఇషాన్ ముఖం..

ఈ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగం ఐదు ముఖాలు విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయి. దక్షిణం వైపు ఉండే ముఖాన్ని అఘోర ముఖం అంటారు. పడమర ముఖంగా ఉన్నదాన్ని సద్యోజాత్ అని, తూర్పు, ఉత్తరం వైపు ఉన్నదాన్ని తత్త్వపురుష, అర్ధనారీశ్వరుడని అంటారు. పైకి ఉండే ముఖాన్ని ఇషాన్ ముఖ అంటారు.

పశుపతినాథ్ ఆలయంలో ఉన్న శివలింగం అద్భుతంగా ఉంటుంది. ఈ శివలింగం పరాస్ రాతితో చెక్కారని చెబుతారు. ఈ రాతిగురించి చెప్పాలంటే ఇనుము దాన్ని తాకినా బంగారంగా మారుతుందని చెబుతారు.

నందిని ఎందుకు దర్శించకూడదు ?

ఆ ఆలయంలో పశుపతి దర్శనం అయిన తరువాత నంది దర్శనం చేసుకోకూడదని చెబుతారు. ఒకవేళ అలా దర్శించుకుంటే వచ్చే జన్మలో జంతువుగా పుడతారని నమ్మకం. ఈ ఆలయం వెలుపల ఆర్య ఘాట్ అని పిలిచే ఒక ఘాట్ ఉంది. ఈ ఘాట్ నుండి మాత్రమే ఆలయం లోపలికి నీటికి తీసుకెళ్లాలని చెబుతారు. మరే ఇతర ఆలయం ఘాట్ నుంచి నీటిని తీసుకెళ్లడం నిషేధం.

Advertisement

Next Story